1
Welcome to maapalle.org

మా పల్లె

అమ్మకూ బిడ్డకూ........ పేగుబంధం.


సొంత ఊరికీ మనకూ......... జ్ఞాపకాల గంధం. అది ఇగిరిపోని గంధం. కంటితడి తగిలితే చాలు, మనసును పన్నీటి సంద్రంలో జలకాలాడించే గంధం.


అమ్మ ఎవరికైనా అమ్మే. సొంతూరు మీకైనా నాకైన ఒకటే. ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాలు ఎదురైనా..... చాలా కాలం తర్వాత కాలం కలిసివచ్చి ఉరిబాట పట్టాం నెనూ, మా తమ్ముల్లూ.


ఈ గాలీ, ఈ నేలా, ఈ ఊరూ , సెలయెరూ .. మముగన్న మావాల్లూ, మా కాళ్ళ లోగిలూ... ఉఫ్ఫ్! ఎంత అందమైన బావన. కళ్ళాలు విప్పుకున్న గుర్రాలమీద, రెక్కలు తెరుచుకున్న ఊహలపైన వడివడిగా వెడుతున్నాం ... ఎందుకంత తొందరంటారా! ! !


అది దసరా. మా ఊరి దసరా.అచ్చంగా మా దసరా.


చిర్రాగోనే, బొంగారాలు, ఉర్రు, కాలికింది కట్టే, నక్కమూటి, గోటిలు, బావుల్లో ఈతలు ఎన్నెన్నో ఆటలు...!! కాలాన్ని గిరుక్కున వెనక్కి తిప్పితే ఎన్నెన్నో జ్ఞాపకాలు... ఏటి గట్లని, అడవి చెట్లనీ, పంట చేలని, పసుల మందని, ఏందీ వెన్నెల్ని, వేడి నాటకాల్ని, శర్తకాల్ల కథల్ని, దొమ్మరి ఆటల్ని, భజన పాటల్ని, అస్స్పిదూల .. అలయ్ బలయ్ పీర్ల పండగల్ని, మంచేలేక్కడం,చిలకల్ని కొట్టడం, గిరాక కొట్టడం, బెల్లం వండటం, పార, పలుగు, తట్ట, బుట్ట, సుత్తి, కొడవలి, నాగలి, బండి గ్యారీ, కమ్మి, ఈత పండ్లు, జీడి పండ్లు, చితిమితి పండ్లు, తునికి పండ్లు, మూర్రి పండ్లు, మారేడు పండ్లు, ఇరికి పండ్లు ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో, అనుభూతులు....


బచ్పన్ కే దోస్తులు, బదలాఇంచని ఆస్తులు.... స్కూల్ వుంటే ... చేతిలో పుస్తకాల సంచి , పెన్ను, పెన్సిళ్ళ డబ్బాతో పొరుగూరికి పొలాల గట్లపైన నడుస్తూ... స్కూల్ లేకుంటే చేతిలో పగ్గం, ముల్లుకట్టె, ముందర ఎడ్లూ నాగళ్ళు. పల్లె పాటలు పాడుతూ ... అదో లోకం .... అదే మా పల్లె




Latest